పునరుత్థానుడా నా యేసయ్యా punnaruddanuda Naa Yesayya

పునరుత్థానుడా నా యేసయ్యా (2)

మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)

స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

ఆరాధించెద నీలో జీవించుచు (2)


1: నీ కృప చేతనే నాకు

నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2)

పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2)

నా విమోచకుడవు నీవేనని

రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి||


2: నే ముందెన్నడు వెళ్ళని

తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2)

సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2)

నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే

పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2) ||స్తుతి||


3: చెరలోనైన స్తుతి పాడుచు

మరణము వరకు నిను ప్రకటించెదా (2)

ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2)

యేసు మేఘాలపై త్వరగా రానుండగా

నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2) ||స్తుతి||




Post a Comment

Previous Post Next Post