Rare chutamu రారె చూతము

రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2)

రాజులకు రా రాజు మెస్సియ (2)

రాజితంబగు తేజమదిగో (2) ||రారె||



1.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2) 
ధరణి కరిగెనీ దినమున (2)
                                           ||రారె||


2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం (2)
తెల్లగానది తేజరిల్లెడి (2)
 తారగాంచరే త్వరగ రారే (2)
                                           ||రారె||


3.బాలుడడుగో వేల సూర్యల  బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాల వృద్ధుల (2)
నేల గల్గిన నాధుడు (2)
                                          ||రారె||















Post a Comment

Previous Post Next Post