సియోనులో నుండి నీవు seeyonulo nundi neevu

సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)

సమాధానమై – సదాకాలము నను నీతో

నడిపించుచున్నావు నీ కీర్తికై

సీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)


నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)

నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)

నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు

విడువవు నను యెడబాయవు

నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో||

నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)

కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి (2)

నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని

కీర్తిoచెదను ప్రతినిత్యం

నిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో||


నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2)

నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)

నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును

మరువను ఎన్నడు విడువను

నేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||







Post a Comment

Previous Post Next Post