ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటి ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
2. ఈ లోక జీవితాన వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
Yevaru Choopinchaleni - Ilalo Nanu Veediponi
Yenthati Prema Needhi - Inthaga Korukundi
Maruvanu Yesayya
Nee Kathe Nanne Thaakaga - Naa Madhe Ninne Cheraga
Naa Gure Neevai Undaga - Nee Dhare Ne Cheraanuga
1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye
Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye
Naa Gunde Lothulona - Ne Naligipothu Unna
Ye Dhaari Kaanaraka - Nee Koraku Vechi Unna
Yedabaatuleni Gamanaana
Ninu Cherukunna Samayaana
Nanu Aadharinche Ghana Prema
Apuroopamaina Tholi Prema
Yekamai Thoduga - Oopire Neevuga
Yevvaru Leruga - Yesayya Neevega
2. Ee Loka Jeevithaana - Vesaaripothu Unna
Viluvaina Needhu Vaakyam - Veliginche Naa Praanam
Nee Sannidhaanamandhu - Seeyonu Maargamandhu
Nee Dhivya Sevalone - Nadipinche Naa Prabhu
Neethoti Saagu Payanaana
Nanu Veedaledhu Kshanamaina
Nee Swaramu Chaalu Udhayaana
Ninu Vembadinchu Samayaana
Saswatha Prematho -
Sathya Vaakyambhutho -
Nithyamu Thoduga -
Niliche Naa Yesayya