అనుక్షణం నా తోడుగ ఉన్నావు Anukahanam naa thoduga vunnavu

అనుక్షణం  నా తోడుగ ఉన్నావు 

ప్రతి దినం నా నీడగ ఉన్నావు (2) 

అడుగులు జారక కాపాడుతు నాతోనే ఉన్నావు 

తడబడు అడుగులు సరిచేస్తూ నడిపిస్తూ ఉన్నావు


ధైర్యము నిచ్చావు, నాకు గమ్యము తెలిపావు

 నే చెయ్యలేని గొప్ప కార్యాలెన్నో సాధ్యము చేసావు 

నూతన పరిచావు నీ రక్షణనిచ్చావు

నిత్య జీవపు మార్గం తెలిపే గొప్ప భాగ్యమునిచ్చావు ||2||

చరణం-1:

నా బాల్యమునందు నీ ఒడిలో చేర్చావు

 నా యవ్వన దశలో నీ త్రోవలో నడిపావు

నా కష్ట సమయాన నా చేయి పట్టావు

నా తండ్రిగ నీవే నను ఆదరించావు


నా ఒంటరి పయనంలో నా వెంటే ఉన్నావు 

నా కన్నీరంతా నాట్యముగా మార్చావు

 నీ కృపనే చూపి నీ కౌగిట దాచావు

 నా గానము నీవై నీ సాక్షిగా నిలిపావు

                                                     //ధైర్యము నిచ్చావు //

నీదు ప్రేమలో నడిచెదను

నీదు సేవలో నిలిచెదను

నీదు మహిమనే చాటెదను

నీదు సాక్షిగా బ్రతికేదను                    ||2||

చరణం-2:

ప్రతి ఉదయమునందు నీ కృపలను తలచెదను

ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను కీర్తించెదను

ప్రతి కార్యములన్నీ నీ మహిమకై చేసెదను

 పరిపూర్ణ హృదయముతో నిన్నారాధించెను


ఏ యోగ్యత లేని నాకిచ్చిన స్థానముకై

 ఏ బేధము లేని నీవు చూపిన ప్రేమకై 

ఏమివ్వగలను నీవు చేసిన త్యాగముకై

 ఈ జీవితమర్పిస్తా నీ సేవ చేయుటకై

                                                    // ధైర్యము నిచ్చావు //



Post a Comment

0 Comments