ప్రేమ యేసయ్య ప్రేమ prema yesayya prema


పల్లవి: ప్రేమ యేసయ్య ప్రేమా (4)

మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ||


తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ

తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)

నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా

తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ||


నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ

నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)

నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా

తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ||


నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ

నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)

తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా

ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ||




Post a Comment

Previous Post Next Post