మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిది
కవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిది
అ. ప: యేసూ నీ ప్రేమ ఒక్కటే...
యేసూ నీ ప్రేమ ఒక్కటే (2)
|| మాటల్లో ||
1:స్వార్థంతో నిండినా ఈలోక ప్రేమాలోనా
మోసముతో కూడినా ఈ మనుషుల ప్రేమ మధ్య (2)
కల్మషమేలేనిది కరుణతో నిండినది (2)
కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది (2)
|| యేసూ నీ ప్రేమ ||
2:పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన
శాపముతో కూడిన - ఈ మనుష్యుల ప్రేమమధ్య (2)
లోకాన్ని ప్రేమించి - రక్తాన్ని చిందించి
సిలువలో మరణించినది - శిక్షను భరియించినది (2)
|| యేసూ నీ ప్రేమ ||