నీవు లేకుంటే ఏమి చేయగలను నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళను
నీవు నాతో ఉండాలే నేను నీతో ఉండలే ||2||
యేసయ్య యేసయ్య యేసయ్య ఆ ఆ ఆ ఆ ||2||
1:తల్లిదండ్రులను వదిలి వచ్చాను
నాకు తండ్రి గా ఉన్నావని ||2||
నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా ||2||
యేసయ్య యేసయ్య యేసయ్య ఆ ఆ ఆ ఆ
అన్నదమ్ములను వదిలి వచ్చాను నాకు అండగా ఉన్నావని ||2||
2:నా అండ నీవయ్యా నా కొండ నీవయ్యా ||2||
యేసయ్య యేసయ్య యేసయ్య ఆ ఆ ఆ
ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవేనని ||2||
నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ||2||
యేసయ్య యేసయ్య యేసయ్య ||2||