ఏదెను వివాహము - అది పరిశుద్ధ వివాహము
నరుడు ఒంటరిగా నుండుట -
మంచిది కాదని ఫలియించి
అభివృద్ధినొందుటకు -
ఆదాము హవ్వలను మన దేవుడు -
జతపరచెను
ఈ నూతన వధూవరులను -
మన దేవుడు సిద్ధపరచెను
మన దేవుడు - జతపరచును
Happy married life to dear blessed couple
దేవుని చిత్తములో - మీరు వృద్ధినొందుదురుగాక
1:గుణవతియైన శారా -
ముత్యముకంటె అమూల్యమైనదై
యజమానుడా అని పిలచుచు -
తన భర్తకు లోబడియుండెను
భర్త భార్యను ప్రేమిస్తే -
భార్య భర్తకు లోబడితే
జ్ఞానము చొప్పున వారికాపురము - జరిగితే
అది కృపలో నిలిచిన కుటుంబం -
శారాలాంటి కుటుంబం
2: భక్తిపరుడైన అకుల -
భక్తిలో శక్తిమంతుడ
సాక్ష్యజీవితము గలిగి -
తన భార్యను ప్రేమించుచుండెను
భర్త భక్తిపరునిగ ఉంటె -
భార్య ప్రభువులో జీవిస్తే
జ్ఞానము చొప్పున వారి కాపురము - జరిగితే
అది కృపలో నిలిచిన కుటుంబం -
అకుల లాంటి కుటుంబం