కల్యాణం కమనీయం Kalyanam kamaniyam

కల్యాణం కమనీయం

ఈ సమయం అతి మధురం (2)

దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కల్యాణం||


1: ఏదెను వనమున యెహోవ దేవా

మొదటి వివాహము చేసితివే (2)

ఈ శుభ దినమున

నవ దంపతులను (2)

నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా||


2: కానా విందులో ఆక్కరనెరిగి

నీళ్ళను రసముగ మార్చితివే (2)

కష్టములలో నీవే

అండగా నుండి (2)

కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా||


3: బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు

గుప్తమైయున్నవి నీయందే (2)

ఇహ పర సుఖములు

మెండుగ నొసగి (2)

ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా||




Post a Comment

Previous Post Next Post