Yuda stuti gotrapu simhama యుదా స్తుతి గోత్రపు సింహమా

యూదా స్తుతి గోత్రపు సింహమా

యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)

నీవే కదా నా ఆరాధన

ఆరాధన స్తుతి ఆరాధన

ఆరాధన స్తుతి ఆరాధన (2)


1: నీ ప్రజల నెమ్మదికై

రాజాజ్ఞ మార్చింది నీవేనని

అహమును అణచి అధికారులను

అధముల చేసిన నీకు (2)

అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||


2: నీ నీతి కిరణాలకై

నా దిక్కు దెశలన్ని నీవేనని

ఆనతికాలాన ప్రధమ ఫలముగా

భద్రపరచిన నీకు (2)

అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||


3: నీ వారసత్వముకై

నా జయము కోరింది నీవేనని

అత్యున్నతమైన సింహాసనమును

నాకిచ్చుఁటలో నీకు (2)

అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||





Post a Comment

Previous Post Next Post