మదురమైన నీ ప్రేమ దివ్యమైన నీ కృపా
నీ మహిమాకె నన్ను నిలిపెన... దేవా
నా కొరకై బలిఐతివా || 2 ||
యేపాటివాడినని ప్రేమించి స్నేహించి
నీ దరికే నన్ను చేర్చితివా ... దేవా
నీ పాపము క్షమించితివా || 2 || ||మదురమైన||
1:ముళ్ల కిరీటము శిరమున నొక్కగా
మౌని వై భరియి౦చితివా ...
కొరడా దెబ్బలే వీపును చీల్చగా
బాదనే సహించితివా || 2 ||
నాదు పాప బారము కొరకై దేవా
ఆ సిలువను నువు మోసితివా ||2||
నాదు శాప విడుదల కొరకై ప్రభువా
గోరమైన శ్రమనొందితివా ||2|| ||మదురమైన||
2:సిలువను మోయుచు దాహము నొందగ
చిరకనే త్రాగించితిరా ... ఆ...
కాళ్లు చేతులలో సిలలు వేసి
ఆ సిలువాకె నిన్ను కొట్టితిరా . . ఆ .. || సిలువను||
నీ అంగీకై చిట్లు వేయగా దేవా వారినే క్షమించితివా
ముఖముపైన ఉమ్మి వేయగా
ప్రభువా అవమానము భరియి౦చితివా ||2|| || మదరమైనా||