అతిసుందరుడవు యేసయ్య (Song-6)

(Song-6) 

అతిసుందరుడవు యేసయ్య -

మనోహరుడవు నీవయ్యా ||2||

యదార్ధవంతుల సభలో పరిశుద్దులతో - 

కలసి నిను ఆరాధించెదను ||2||

హల్లెలూయా హల్లెలూయా - 

హోసన్నా ఆరాధన ||2||


1.నీ సన్నిధిలో సంపూర్ణమైన -

 సంతోషము కలదు

కృపాక్షేమముతో నీ మందిరములు - 

సమృద్ధిగా కలవు ||2||

నే దీనుడనై నీ సన్నిధిని - 

అనుభవించెదను ||2||

పరవశించి పరవళ్ళుత్రొక్కి -

 ఆరాధించెదను    ||2||

                    ||అతిసుందరుడవు||


2. అమూల్యమైన వాగ్దానములు - 

అనుగ్రహించావు

అత్యధికముగా ఆశీర్వదించి - 

హెచ్చించియున్నావు ||2||

విశ్వసముతో ఓర్పుకలిగి 

వాగ్దానమునే - పొందెదను ||2||

సంపూర్ణతకై పరిశుద్దుడనై - 

ఆరాధించెదను ||2||

                        ||అతిసుందరుడవు||


3. మహారాజువై సీయోనులో - 

ఏలుచున్నావు 

పునాదులు గల పట్టణమును -

కట్టుచున్నావు ||2||

సౌందర్యముగల సీయోనులో - 

ప్రకాశించుచున్నావు ||2||

నీ మహిమనుపొంది నీ ధరిచేరి - 

ఆరాధించెదను     ||2||

                        ||అతిసుందరుడవు||


ఆరాధనకు నీవే యోగ్యుడవు -

స్తుతులకు నీవే పాత్రుడవు ||2||


అతి సుందరుడా - మనోహరుడా ||2||

                             || అతిసుందరుడవు||





Post a Comment

Previous Post Next Post