(Song-5)
కృపా - కృపా సజీవులతో
నన్ను నిలిపినాది నీ కృపా ||2||
నా శ్రమ దినమున నాతో నిలిచి
నన్ను ఓదార్చినా నవ్య కృప నీదు కృప ||2||
కృపాసాగర మహోన్నతమైన
నీ కృపా చాలున్నాయా ||కృపా||
1: శాశ్వతమైన నీ ప్రేమతో
నన్ను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై..నే
నీ దివ్య సన్నిధిలో నన్ను ఒదిగిపోని ||2||
నీ ఉపదేశమే నాలో ఫలభరితమై
నీ కమనీయ కాంతులను విరజిమ్మనే ||2||
నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే ||కృపా||
2: గాలి తుఫానుల అలజడితో
గూడు చెదరిన గువ్వా వాలే
గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి ||2||
నీ వాటశైలమే నవవసంతము
నా జీవిత దినమున ఆద్యన్తము ||2||
ఒక క్షణమైనా విడువని ప్రేమామృతము ||కృపా||
3: అధునాతమైన కృపాలతో
ఆత్మ ఫలముల సంపదతో
అతిశ్రేష్ఠమైన స్వస్థమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించువేలా ||2||
నా హృదయార్పణ నీలో మురిపించని
నీ గుణాతిశయములను కీర్తించని ||2||
ఈ నిరీక్షణ నాలో నెరవేరని ||కృపా||