కన్ను తెరిస్తే వేలుగుర Kannu Teriste velugura

కన్ను తెరిస్తే వెలుగురా

కన్ను మూస్తే చీకటిరా || 2||

నోరు తెరిస్తే శబ్దమురా

నోరు మూస్తే నిశబ్దమురా

ఏ క్షణమో తెలియదు జీవితం అంతం

ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ॥కన్ను తెరిస్తే॥


1: ఊయల ఊగితే జోల పాటరా

ఊయల ఆగితే ఏడుపు పాటరా ||2||

ఊపిరి ఆగితే ఊగిసలాటరా

ఊపిరి ఆగితే సమాధి పోటురా  ॥ఏ క్షణమో॥


2: బంగారు ఊయలా ఊగినా నీవు

భుజములపై నిన్ను మోయక తప్పదురా ||2||

పట్టు పరుపు పైనా పొర్లిన నీవు

మట్టి పరుపులోనే ఎట్టక తప్పదురా ॥ఏ క్షణమో॥





Post a Comment

Previous Post Next Post