దేవా యేసయ్య ప్రభువా మెసయ్య
దయతో కావుమయ్య నీ కృప తో నింపుమయ్య
నిన్ను ఘనపరుతును నిన్ను కీర్తింతును
మనసార స్తుతి ింతును ||2|| ||దేవా||
1:రత్నవర్ణుడు నీవని దవల వర్ణుడు నీవేనని ||2||
సుమనోహరుడవు నీవేనని
శాశ్వతకాలం వుంటావు అని ||నిన్ను ||
2: పాపుల రక్షణ కై వచ్చావు అని...
కల్వరిలో బలి ఐనావని ... ఆఆ..
మృత్యుంజయుడు అయి లేచావు అని
మరల మకై వస్తావు అని ..ఈ ..||నిన్ను||