మూడునాళ్ళ ముచ్చట కోసం Mudunalla muchata kosam

మూడునాళ్ళ ముచ్చట కోసం

ఈ మనిషి పడే తపన చూడరా (2)

నీటిబుడగలాంటి జీవితం

ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2)


1: మనిషికి తన మనసే చేరసాలరా

మమతలు మమకారాలు బంధాలురా (2)

వల్లకాటి వరకేరా భవబంధాలు

నీ కళ్లానికి చేరవురా అనుబంధాలు (2)

కల్లలైన కళలు మానుకో

ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) 

                                    ||మూడునాళ్ళ||


2: ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము

అది కనిపించీ మాయమయే రంగులవలయం (2)

గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం

అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2)

నిత్యమైన సుఖము వెదకరా

నిరతము ప్రభుని కోరరా (2)

                               ||మూడునాళ్ళ||


3: తప్పిదములు దాచువాడు వర్దిల్లడు

అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2)

జిగటగల ఊభినుండి పైకి లేపి

నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2)

తీర్పు తీర్చబడకమునుపే

తప్పక ఆ ప్రభుని కోరరా (2) 

                           ||మూడునాళ్ళ||





Post a Comment

Previous Post Next Post