విడువలేదెన్నడూ నీవు నా చేయి
మరువలేదెన్నడూ నన్ను నీ కృప ||2||
యేసయ్యా... రక్షణ ప్రాకారమా...
యేసయ్యా... నాకున్న ఆధారమా ||2||
1: నా గుడారముపై నీ దృష్టిని నిలిపి
ప్రతి శాపమును తొలగించినావు
పరలోక సంపదలు సమృద్ధిగా నింపి
ఆశీర్వదించి హెచ్చించినావు ||2||
నీ సరిహద్దులను నే దాటిపోకుండా
నీ పాదసన్నిధిలో నను నిలిపినావు ||2||
||విడువలేదెన్నడూ||
2: నీవుండు స్థలములో నేనుండాలని
పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతో
మలిన వస్త్రములు తీసివేసి
రక్షణ వస్త్రములు తొడిగించినావు ||2||
అర్హత లేకున్నా నీ సేవ కొరకు
యాజక వస్త్రములు ధరింపచేసితివి ||2||
||విడువలేదెన్నడూ||
3: ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద
దాచియుంచితివి ఈనాటి వరకు
నీ మందిరములో పూర్ణ హృదయముతో
ఆరాధించుటకు ఆత్మతో నింపితివి ||2||
నీకు విరోధముగా రూపించే
ఏ ఆయుధము వర్ధిల్లదంటివే ||2||
||విడువలేదెన్నడూ||