పాట రచయిత: సిరిపురపు కృపానందము
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)
సందేహమేలనయ్య
1: సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)
2: ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)
3: ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
4: దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
5: ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)
6: చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)
7: శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)