Ningiloni chanduruda నింగిలోని చందురుడా

నింగిలోని చందురుడా -

మంద కాచే ఇందురుడా - 2

నిందలేని సుందరుడా - 

గంధమొలికే చందనుడా - 2

ఓ... వెన్నెలంటి చల్లని రాజా -

వెన్నలాంటి మనసు నీదయ్యా - 2


1: ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - 

గాయాలు నిన్ను బాధిస్తున్నా

దాహంతో నోరు ఎండిపోతున్నా - 

నాలుక అంకిట అంటిపోతున్నా

ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - 

నీ శ్రమ చూడలేక గుండెపగిలిన

తల్లిని శిష్యునికప్పగించి - 

నీ బాధ్యతను నెరవేర్చినావా ? - 2

ఓ... వెన్నెలంటి చల్లని రాజా - 

ఎంత ప్రేమామూర్తి నీవయ్యా - 2


2:అందాల మోముపై ఉమ్మివేయగా - 

నీదు గడ్డము పట్టి పీకగా

యూదులరాజని అపహసించగా - 

సిలువ దిగిరమ్మని పరిహసించగా

అంతా సహించి - మౌనం వహించి - 

బాధించువారిపై ప్రేమ చూపించి


ఏమిచేస్తున్నారో ఎరుగరు - 

క్షమించుమని ప్రార్ధించినావా - 2

ఓ... వెన్నెలంటి చల్లని రాజా - 

ఎంత సహనం చూపినావయ్యా - 2


3: లేతమొక్కలాంటి నీ దేహముపై - 

కొరడాలెన్నో నాట్యముచేయగా

మేలే చేసినా కరుణను పంచినా - 

కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా

అంతటి శ్రమలో - చెంతననిలిచి - 

చింతతో ఉన్న అతివల జూచి


నాకోసం ఏడ్వవలదని - 

పలికి వారిని ఓదార్చినావా - 2

ఓ... వెన్నెలంటి చల్లని రాజా - 

ఎంత కరుణామయుడ నీవయ్యా - 2




Post a Comment

Previous Post Next Post