Ninnu kapaduvadu kunukadu నిన్ను కాపాడువాడు కునుకడు

నిన్ను కాపాడువాడు కునుకడు

నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)

నీ భారము వహియించు యేసు

నీ కొరకై మరణించె చూడు (2) 

                                     ||నిన్ను కాపాడు||

1:పలుకరించే వారు లేక పరితపిస్తున్నా

కనికరించి వారు లేక కుమిలిపోతున్నా (2)

కలతలెన్నో కీడులెన్నో

బ్రతుకు ఆశను అణచివేసినా (2)

ఎడబాయడు యేసు నిన్ను

దరి చేర్చును యేసు నిన్ను (2) 

                                     ||నిన్ను కాపాడు||

2:మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా

పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)

భీతులెన్నో భ్రాoతులెన్నో

సంతసంబును త్రుంచివేసినా (2)

ఎడబాయడు యేసు నిన్ను

దరి చేర్చును యేసు నిన్ను (2) 

                                    ||నిన్ను కాపాడు||





Post a Comment

Previous Post Next Post