Evaru vunna lekunna ఎవరు ఉన్నా లేకున్నా

ఎవరు ఉన్నా లేకున్నా

యేసయ్య ఉంటే నాకు చాలు (2)

అందరి ప్రేమ అంతంత వరకే

యేసయ్య ప్రేమ అంతము వరకు (2) 

                                       ||ఎవరు||


కునుకడు నిదురపోడు

కాపాడుతాడు నన్నెప్పుడు (2)

ఆపదొచ్చినా అపాయమొచ్చినా (2)

రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2) 

                                       ||అందరి||


1:తల్లి మరచినా తండ్రి విడచినా

నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు (2)

ముదిమి వచ్చినా తల నెరిసినా (2)

చంక పెట్టుకొని నన్ను మోస్తాడు (2) 

                                         ||అందరి||


2:అలసిన కృషించినా

తృప్తి పరచును నన్నెల్లప్పుడు (2)

శత్రువొచ్చినా శోధనలు చుట్టినా (2)

రెక్కలు చాపి నన్ను కాపాడును (2)

                                         ||అందరి|| 






Post a Comment

Previous Post Next Post