ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా Premista ninney naa yesayya

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా

పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2)

చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా

యేసయ్యా నీ సన్నిధి చాలయా (2)

                                  ||ప్రేమిస్తా||


1: నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ

   సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2)

  ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు

  నా జీవమర్పింతు నీ సేవకు (2)

                                    ||చాలయ్యా||


2: కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ

   కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2)

   ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు

   నా జీవమర్పింతు నీ సేవకు (2)

                                    ||చాలయ్యా||


3: నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ

   నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2)

  ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు

  నా జీవమర్పింతు నీ సేవకు (2)

                                      ||చాలయ్యా||





Post a Comment

Previous Post Next Post