పరాక్రమముగల బలాఢ్యుడా
నీ కంటికి కనిపించే
నీ చెవులకు వినిపించే
అరె దేనిని గూర్చి భయపడకు
భయపడకు…. భయపడకు…. 3
హే దహించు ఆగ్నయన
నీ దేవుడే నీముందు వెళ్తుంటే
భయమెందుకు?
నీకంటే బలమైన ఆజనములు
నీముందు నిలవలేరు
పద ముందుకు !
ఇక చేసుకొ
స్వాధీనం! స్వాధీనం …. ఓ .. స్వాధీనం …. ఓ .. స్వాధీనం ….
take take take-over – take take take-over
take take take-over – take take take-over ||పరా||
1: నీవలన భయమును ప్రతి జనముకు
నీ ప్రభువు పుట్టించును
నువ్వడుగు పెట్టేటి
ప్రతి స్థలమును ప్రభు
ఏనాడో నీకిచ్చెను
ఈభూమి మొత్తాన్ని
నీస్వంతం చేసాడు
లోబరచి ఏలేయను
అరె ఈదేశ వైశాల్యమంత
నువ్వడుగేసి
ప్రభు జండ స్థాపించను ||ఇక||
2: దేశపు ఉన్నత స్థలములపైన
ప్రభు నిన్ను ఎక్కించును
పాడైన దాని పునాదులను
ప్రభు నీచేత కట్టించును
తన రాజ్య మకుటంగా
తనరాజ్య దండంగ
ప్రభు నిన్ను నియమించెను
శాశనము స్థాపించు
తన ముద్ర ఉంగరముగా
ప్రభువు నిన్నుంచెను ||ఇక||
3: నీకొరకు ప్రభుని తలంపులు
అన్ని అత్యున్నతముగుండెను
నీశక్తి మించిన కార్యములను
ప్రభు నీచేత చేయించును
గుడార స్థలములను విశాలపరచింక –
కుడిఎడమ వ్యాపించను
ప్రతి అడ్డు గడియల్ని
విడగొట్టి నీ ప్రభువు –
ముందుండి నడిపించును ||ఇక||