సంగీత నాదముతో Sangeeta Nadamutho

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో

నీ ప్రేమ గీతం పాడెద

నీ గోప్ప కార్యం చాటెద

నా జీవితం మార్చిన యేసయ్యా

ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత||


1:నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి

కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)

పాపములు క్షమియించి నను మార్చిన

దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ||


2:నా కష్ట సమయమున నా చెంతనే నిలచి

విడువక నడిపించిన విధమును వివరించెద (2)

క్షేమమును కలిగించి నను లేపిన

దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ||


3:నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి

కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)

వాక్యముతో దర్శించి బలపరిచిన

సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||




Post a Comment

Previous Post Next Post