బాటసారి ఓ బాటసారి batasari oo batasari





పల్లవి:బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి|2|

పయనించే బాటసారి,బాటసారి ఓ బాటసారి

వినవయ్యా ఒక్కసారి


వెండి తాడు విడిపోవును

బావి యొద్ద చక్రం పడిపోవును |2|

ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే |2|

నీటి బుడగలాంటిదీ జీవితం |2|

విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2|

||బాటసారి||


పరదేశులం యాత్రీకులం

శాశ్వతం కాదు ఈ దేహం |2|

మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును |2|

ఆత్మ దేవుని యొద్దకు చేరును |2|

విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2|

||బాటసారి||


నీ జీవిత గమ్యమెక్కడో

యోచింపవా ఓ మానవా |2|

అగ్ని ఆరదు పురుగు చావదు|2|

నిత్య నరకమునకు పోవద్దురా|2|

యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో|2|

||బాటసారి||




Post a Comment

Previous Post Next Post