యేసు స్వామీ నీకు నేను -
నా సమస్త మిత్తును -
నీ సన్నిధి-లో వసించి -
ఆశతో సేవింతును
నా సమస్తము - నా సమస్తము
నా సురక్షకా నీ కిత్తు - నా సమస్తము
యేసు స్వామీ నీకు
నేను ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోక యాశల్
యేసు చేర్చుమిప్పుడే
||నా సమస్తము॥
నేను నీ వాడను యేసు -
నీవును నా వాడవు నీవు నేను
నేకమాయే నీ శుద్దాత్మ సాక్ష్యము
॥నా సమస్తము॥
యేసు నీదే నా సర్వాస్తి
హా సుజ్వాలన్ పొందితి హా
సురక్షణానందమా
హల్లెలూయా స్తోత్రము
॥నా సమస్తము॥