Raja nee sannidhilo రాజా నీ సన్నిధిలో

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య

మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య

నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య

నీవే లేకుండా నేనుండలేనయ్య

నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య


1: నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం

ఆరాధించుకొనే విలువైన అవకాశం

కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును

బాధల నుండి బ్రతికించుటకును

నీవే రాకపోతే నేనేమైపోదునో


2: ఒంటరి పోరు నన్ను విసిగించిన

మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా

ఒంటరివాడే వేయి మంది అన్నావు

నేనున్నానులే భయపడకు అన్నావు

నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య


3: ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా

ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా

విశ్వానికి కర్త నీవే నా గమ్యము

నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము

నిన్ను మించిన దేవుడే లేడయ్య







Post a Comment

Previous Post Next Post