Ye badha ledu ye kastam ledu ఏ బాధ లేదు ఏ కష్టం లేదు

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా

ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా 

దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా ... 

భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా ...

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా 


1. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా - యెరికో గోడలు అడొచ్చినా 

సాతానే శోధించినా శత్రువులే శాసించినా 

పడకు భయపడకు బలవంతుడే నీకుండగా 

నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ... 


2. పర్వతాలు తొలగినా - మెట్టలు దద్దరిల్లినా 

తుఫానులే చెలరేగినా - వరదలే ఉప్పొంగినా 

కడకు నీ కడకు ప్రభుయేసే దిగి వచ్చుగా 

నమ్ము ఇది నమ్ము యెహెూవా యీరే గదా ...

                                                  || ఏ బాధ లేదు ||




Post a Comment

Previous Post Next Post