పల్లవి: వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది | | వివాహమన్నది| |
1. ఎముకలలో ఒక ఎముకగా -
దేహములో సగ భాగముగా నారిగా సహకారిగా -
స్త్రీని
నిర్మించినాడు దేవుడు
| | వివాహమన్నది | |
2. ఒంటరిగా ఉండరాదని -
జంటగా ఉండ మేలని
శిరస్సుగా నిలవాలని -
పురుషుని
నియమించినాడు దేవుడు
| | వివాహమన్నది | |
3. దేవునికి అతి ప్రియులుగా -
ఫలములతో వృద్ధి పొందగా వేరుగానున్న వారిని -
ఒకటిగ ఇల చేసినాడు దేవుడు
| | వివాహమన్నది | |