Srusti kartha సృష్టి కర్తా

సృష్టి కర్తా యేసు దేవా

సర్వ లోకం నీ మాట వినును (2)

సర్వ లోక నాథా సకలం నీవేగా

సర్వ లోక రాజా సర్వము నీవేగా

సన్నుతింతును అను నిత్యము

                                         ||సృష్టి||

1:కానాన్ వివాహములో అద్భుతముగా

నీటిని ద్రాక్షా రసము చేసి

కనలేని అంధులకు చూపు నొసగి

చెవిటి మూగల బాగు పరచితివి

నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో

ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు

                                         ||సర్వ||

2:మృతుల సహితము జీవింపజేసి

మృతిని గెలిచి తిరిగి లేచితివి

నీ రాజ్యములో నీతో వసింప

కొనిపోవ త్వరలో రానుంటివే

నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో

ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు 

                                          ||సర్వ||






Post a Comment

Previous Post Next Post