Chuchuchunna devudavu చూచుచున్న దేవుడవు

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా

చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన

నీ నేత్రాలంకృతము (2)


1: పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో

క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)

ఆప్యాయతకు నోచుకొనని

నను చేరదీసిన కృపా సాగరా (2) 

                                       ||చూచుచున్న||

2: అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు

తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)

అగ్ని వంటి శోధనలను

తప్పించితివే దయా సాగరా (2)

                                      ||చూచుచున్న|| 






Post a Comment

Previous Post Next Post