Nee jeevitam viluvainadi నీ జీవితం విలువైనది

నీ జీవితం విలువైనది

ఏనాడు ఏమరకు

శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం

ఈనాడే యోచించుమా

ఓ నేస్తమా తెలియునా

ప్రభు యేసు నిన్ను పిలిచెను

నా నేస్తమా తెలిసికో

ప్రభు యేసు నీకై మరణించెను 

                                                               ||నీ జీవితం||

1: బలమైన పెను గాలి వీచి

అలలెంతో పైపైకి లేచి (2)

విలువైన నీ జీవిత నావా

తలకిందులై వాలిపోవ

వలదు భయము నీకేలా

కలదు యేసే నీ తోడు

యేసు మరణించి మరి లేచెను

నిన్ను ప్రేమించి దరి చేర్చును

                                   ||నీ జీవితం||

2: గాఢాంధకారంపు లోయలో

వల గాలి వడి సవ్వడిలో (2)

నడయాడి నీ జీవిత త్రోవా

సుడివడి నీ అడుగు తడబడిన

వలదు భయము నీకేలా

కలదు యేసే నీ తోడు

యేసు మరణించి మరి లేచెను

నిన్ను ప్రేమించి దరి చేర్చును

                                  ||నీ జీవితం||

3: కనలేని గమ్యంబు కోరి

ఎనలేని కష్టాల పాలై (2)

మనలేని నీ జీవిత గాథా

కలలన్ని కన్నీటి వ్యథలే

వలదు భయము నీకేలా

కలదు యేసే నీ తోడు

యేసు మరణించి మరి లేచెను

నిన్ను ప్రేమించి దరి చేర్చును 

                                   ||నీ జీవితం|| 




Post a Comment

Previous Post Next Post