(శ్రేష్టము) బలులు అర్పించుటకంటే (Srestamu)Balulu Arpinchuta kante

Lyrics: Amara Kumari

Tune : Ratnam & Sudheer Sunny

Vocal: Sudheer Sunny

Music: Sudhakar Rella


పల్లవి: బలులు అర్పించుటకంటే నీ         

ఆజ్ఞను  గైకొనుట శ్రేష్టము

పోటేళ్ళ క్రొవ్వును అర్పించుటకంటే

నీ మాటకు లోబడుట శ్రేష్టము...||2||


శ్రేష్టము శ్రేష్టము మాటవినుట శ్రేష్టము 

శ్రేష్టము శ్రేష్టము లోబడుట శ్రేష్టము..||2||


యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ||2||

                                                    ||బలులు||

 

1. నీ మాటను వినిన అబ్రాహాము 

    విశ్వాసుల తండ్రిగా మారినాడుగా 

   నీ మాటను వినిన సమూయేలు 

    అభిషేకించు ప్రవక్త ఆయెగ...||2||

 

   మాట వినుట మాకు నేర్పుము 

   నీ మార్గములో మమ్ము నడుపుము

                                 || యేసయ్యా ||


2.  నీ మాటను వినిన గిద్యోను

      పరాక్రమశాలిగా మారినడుగా 

    నీ మాటను వినిన దావీదు రాజు

    శాశ్వత సింహాసనం పొందినాడుగా

  

  మాట వినుటను మాకు నేర్పుము

  నీ మార్గములో మమ్ము నదుపుము

                               || యేసయ్యా ||




Post a Comment

Previous Post Next Post