అతి పరిశుద్ధుడా Athi Parishudda

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

నీకే అర్పించి కీర్తింతును 

నీవు నా పక్షమై నను దీవించగా 

నీవు నా తోడువై నను నడిపించగా 

జీవింతును నీ కోసమే 

ఆశ్రయమైన నా యేసయ్యా    

                                        || అతి పరిశుద్ధుడా || 

సర్వోన్నతమైన స్థలముల యందు 

నీ మహిమ వివరింపగా 

ఉన్నతమైన నీ సంకల్పము 

ఎన్నడూ ఆశ్చర్యమే 

ముందెన్నడూ చవి చూడని 

సరిక్రొత్తదైన ప్రేమా మృతం 

నీలోనే దాచావు ఈనాటికై 

నీ ఋణము తీరదు ఏనాటికీ.    

                                    || అతి పరిశుద్ధుడా || 


సద్గుణ రాశి నీ జాడలను 

నా ఎదుటే నుంచుకొని 

గడిచిన కాలం సాగిన పయనం 

నీ కృపకు సంకేతమే

కృప వెంబడి కృప పొందగా 

మారాను మధురముగా నే పొందగా 

నాలోన ఏ మంచి చూశావయ్యా 

నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా 

                                      || అతి పరిశుద్ధుడా || 


సారెపై నున్న పాత్రగ నన్ను 

చేజారి పోనియ్యక  

శోధనలెన్నో  ఎదిరించినను

నను సోలి పోనియ్యక  

ఉన్నావులే ప్రతి క్షణమునా 

కలిసున్నావులె ప్రతి అడుగునా  

నీవేగా యేసయ్య నా ఊపిరి  

నీవేగా యేసయ్యా నా కాపరి       

                             || అతి పరిశుద్ధుడా || 




Post a Comment

Previous Post Next Post