శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోన
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన || 2 ||
ఆ వెలుగు చూడంగ చాలవంట రెండు కళ్ళు
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు || 2 ||
ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము
ఓయమ్మా మెరమ్మో కానుకలు తెచ్చాము || 2 ||
|| శ్రీయేసు ||
1) పాపాలకు, మన లోపలకు -
ఇఁక చెల్లి పోయింది కాలము
మనలోన చీకటి, తొలగించగా -
నేడు తెచ్చాడు మనకై తన తేజము || 2 ||
వేలాది సూర్యులంత వెలుగున్న వాడు
వెలలేని మనిషిగా మనలా మెలిగాడు || 2 ||
|| ఓ అయ్యా ||
2) మరణము చెరలను గెలిచేందుకు -
ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన సన్నిధిని విడిచిన మనలను -
చేర్చేందుకయినాడు తను మార్గము || 2 ||
ఏ మంచి లేన్నట్టి మట్టి మనుష్యులను
మహిమలో నిలపాలని మహిమ విడిచాడు || 2 ||
|| ఓ అయ్యా ||