ఆకాశ వీధుల్లో ఆనందం Akaasa Veedhullo Anandam

ఆకాశ వీధుల్లో ఆనందం -  ఆ నింగి తారల్లో ఉల్లాసం  

ఈ రేయి వెన్నెల్లో సంతోషం -  ఇల పొంగేను లోలోన సంగీతం 

లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్ 


లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య

దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య

ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక

మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక

సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె


1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ 

దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ

చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే

వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే

సదా స్నేహమై నా సొంతమై  పరమాత్ముడే ఈనాడే జన్మించె


అహా  సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం  

సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం 


2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను

పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను

వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో

అంతులేని చింతలేని పరమునే పొందుకో

సదా తోడుగా నీ అండగా  పరమాత్ముడే ఈనాడే జన్మించె



Akaasa Veedhullo Anandam - Aa Ningi Thaarallo Ullasam

Ee Reyi Vennello Santhosham - Ila Pongenu Lolona Sangeetham

Lokaalake Raraajugaa - Yesayya Puttadugaa .. Hehey 


Lokaalanele Naadhudu Velisaadu Naa Messiah 

Daricherinaadu Deenudai Dharalona Naa Yesayya

Ilalo Jaadagaa Palikindhigaa Vinthaina O Taaraka

Madilo Nindugaa O Panduga Techhadu Naa Rakshaka

Sadaa Deepamai Santhoshamai Paramaathmude Eenade Janminche


1. Gollalantha Ganthulesi Sandhade Chesiri

Doothalanthaa Santhasinchi Sthuthulane Paadiri 

Cheekatanti Brathukulona Chelimigaa Cherene

Vennelanti Mamatha Choopi Karunatho Korene

Sadaa Snehamai Naa Sonthamai Paramaathmude Eenade Janminche


Aha Santhoshame Mahadaanandame Ila Vachindhi O Sambaram

Samaadhaaname Ila Nee Kosame Digivachhindigaa Ee Dinam 


2. Vaakyamaina Devudegaa Baludai Vachchenu

Paapamantha Teesiveya Rakshane Techhenu

Vedukaina Ee Dinaana Yesune Veduko 

Anthuleni Chinthaleni Paramune Pondhuko

Sadaa Thodugaa Nee Andaga Paramaathmude Eenade Janminche




Post a Comment

Previous Post Next Post