ఎన్ని తలచినా ఏది అడిగినా Enni talachina

ఎన్ని తలచినా ఏది అడిగినా

జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా

నీ వాక్కుకై వేచియుంటిని

నా ప్రార్థన ఆలకించుమా (2)   |ప్రభువా| 


1: నీ తోడు లేక నీ ప్రేమ లేక

ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు  (2)

అడవి పూవులే నీ ప్రేమ పొందగా  (2)

నా ప్రార్థన ఆలకించుమా  (2)  |ప్రభువా |

                                   ||ఎన్ని||


2: నా ఇంటి దీపం నీవే అని తెలసి

నా హృదయం నీ కొరకై పదిలపరచితి   (2)

ఆరిపోయిన నా వెలుగు దీపము   (2)

వెలిగించుము నీ ప్రేమతో    (2)   |ప్రభువా| 

                                    ||ఎన్ని||


3:  ఆపదలు నన్ను వెన్నంటియున్నా

నా కాపరి నీవై నన్నాదుకొంటివి  (2)

లోకమంతయూ నన్ను విడచినా  (2)

నీ నుండి వేరు చెయ్యవు   (2)  |ప్రభువా|

                                      ||ఎన్ని||


 4: నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి

నా కొరకై కల్వరిలో యాగమైతివి   (2)

నీదు యాగమే నా మోక్ష మార్గము   (2)

నీయందే నిత్యజీవము   (2)   |ప్రభువా |

                                        ||ఎన్ని||








Post a Comment

Previous Post Next Post